Pravasa Bharatiya Day: 18 వ ప్రవాస భారతీయ దినోత్సవం..! 14 h ago
రతదేశ అభివృద్ధికి ప్రవాసీ భారతీయులు చేస్తున్న సహకారాన్ని గుర్తించాలన్న ఉద్దేశ్యంతో 2003 నుంచి జనవరి 9న ప్రవాస భారతీయ దినోత్సవాన్ని ప్రతియేటా విదేశీ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. 18వ ప్రవాస భారతీయ దినోత్సవాన్ని ఒడిస్సా లో నిర్వహించారు.
• 2025 థీమ్: విక్షిత్ భారత్ కు డయాస్పోరా సహకారం(DIASPORA'S CONTRIBUTION TO A VIKSIT BHARAT)
• జనవరి 9 ప్రత్యేకత: 1915, జనవరి 9 నాడు భారత జాతిపిత మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి వచ్చిన రోజు. ఆ కారణంగానే ప్రవాసీ భారతీయ దివస్ గా జరుపుకోవడానికి ఈ రోజును ఎంచుకున్నారు.
• ఎల్ఎం సింఘ్వీ ఉన్నత స్థాయి కమిటీ: ఎల్ఎం సింఘ్వీ నేతృత్వంలోని భారతీయ ప్రవాసులపై ఉన్నత స్థాయి కమిటీ జారీ చేసిన సిఫార్సుల మేరకు ప్రవాసీ భారతీయ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. నాటి ప్రధాని అటల్ బీహార్ వాజ్‌పేయి ప్రకటన తర్వాత ప్రవాసీ భారతీయ దివస్‌ను జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు.
ప్రవాసీ భారతీయ దివస్ ముఖ్య ఉద్దేశ్యం..
విదేశాలలో నివసిస్తున్న భారతీయుల విజయాలను ప్రపంచం ముందుకు తీసుకురావడం. తద్వారా వారి బలాన్ని, ప్రతిభను ప్రపంచం గుర్తించేలా చేయడం. ఈ ప్రవాసీ భారతీయ దివస్ పేరుతో ప్రవాసీలు స్వదేశీయులతో కలిసే అవకాశం లభిస్తుంది. 2003 నుంచి జరుపుకుంటున్న ప్రవాసీ భారతీయ దివస్ కారణంగా ప్రవాసీలతో భారతీయ సంబంధాలు మరింత బలపడుతున్నాయి. అలాగే ప్రవాసీల కారణంగా భారత్లో విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నాయి. దీని ప్రత్యక్ష ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతోంది. భారత విదేశాంగశాఖ లెక్కల ప్రకారం దాదాపు 3.5 కోట్ల మంది భారతీయులూ, భారతీయ మూలాలున్న వారు విదేశాల్లో ఉన్నారు. వారిలో 1.8 కోట్ల మంది తాము ఉంటోన్న దేశ పౌరసత్వం తీసుకోగా, 1.4 కోట్ల మంది భారతీయ పౌరసత్వాన్ని కొనసాగిస్తున్నారు.
మే, 2024 నాటికి ప్రవాస భారతీయులు, భారత సంతతి వారూ కలిపి అత్యధికంగా ఉన్న మొదటి 5 దేశాలు: అమెరికా (54 లక్షలకు పైగా), యూఏఈ (36 లక్షలకు పైగా), మలేషియా(29 లక్షలకు పైగా), కెనడా (28 లక్షలకు పైగా), సౌదీ అరేబియా (25 లక్షలకు పైగా). ప్రవాస భారతీయులూ, భారత సంతతి వారూ కలిపి ఎక్కువగా ఉన్నది మాత్రం అమెరికాలో వీరి సంఖ్య 54 లక్షలకు పైగా. ఆ దేశ జనాభాలో వీరిది 1.6శాతం(345 మిలియన్). ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం 2024లో ప్రవాసులు స్వదేశానికి పంపిన మొత్తం రూ.129 బిలియన్ల అమెరికన్ డాలర్లు. ఈ విషయంలో ప్రపంచంలోనే భారత్ అగ్ర స్థానం. గతానికి భిన్నంగా ప్రస్తుతం- గల్ఫ్ దేశాల నుంచి కాకుండా అమెరికా, కెనడా, యూకే, సింగపూర్ లాంటి దేశాల్లో ఉన్నతస్థాయి ఉద్యోగాలు చేస్తున్న వారి నుంచి ఎక్కువ మొత్తం వస్తోంది. ఆరు గల్ఫ్ దేశాల నుంచి 28 శాతం వస్తుండగా ఒక్క అమెరికా నుంచే 23 శాతం వస్తోంది.